నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తల్లాడ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,ఈరోజు తల్లాడ క్రీస్తు సంఘము ప్రార్థన మందిరం నందు 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జండా వందనం చేయుట జరిగినది. ఈ కార్యక్రమాన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తల్లాడ మండల అధ్యక్షులు బ్రదర్:సంగసాని శ్రీనివాస్ గారు జెండాను ఎగురువేట జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ, మండల ,జిల్లా ,రాష్ట్ర ,దేశ ప్రజలకు వజ్రోత్సవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు, భారతదేశము లౌకిక దేశము,విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు కలయికయే భారత దేశమని, భారత దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని జాతుల వారు, శాంతి సమాధానము కలిగి ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలతో జీవించాలని వారు కోరారు వారు. దేశంలో జరుగుచున్నటువంటి దాడులను వారు ఖండిస్తూ క్రైస్తవ పాస్టర్లపై క్రైస్తవ బోధకులపై మత చాందసవాదులు దాడుల చేయటము అవమానకరమని, భారత దేశంలో నేటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మానవతా విలువలు ప్రజలు కోల్పోకూడదని ఆ విధముగా ప్రభుత్వము దృష్టి సారించి మతశాంధస్వాందులను అరికట్టాలని, 75 సంవత్సరాల స్వాతంత్రము తర్వాత కూడా మత స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేకపోవడం బాధాకరమని తెలియజేశారు.సందర్భంగ దేశంలో శాంతి సమానత్వము ఐక్యత సౌభాతృత్వము కలిగి ప్రజలందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఏసురత్నం గారు, కార్యదర్శి ఇసనేపల్లి శ్రీనివాస్ రావు గారు, కోశాధికారి ఎక్కిరాల జాన్సన్ గారు, ఎగ్జిక్యూటివ్ నెంబర్ బండి చిన్నప్ప గారు మండల పాస్టర్ ఎన్సిసి లీడర్స్, సంఘ పెద్దలు, విశ్వాసులు,తదితరులు పాల్గొని,జండా వందన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.